
కుటుంబ పోషణ భారంగా మారింది..
మాకు ఆరు నెలల నుంచి జీతాలు రావడం లేదు. నెలల తరబడి జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారింది. రోజంతా పనిచేస్తున్నా సరైన వేతనం లేక ఇబ్బందులు పడుతున్నాం. నెలనెలా వేతనాలు ఇచ్చి తమ సమస్యను పరిష్కరించాలి.
– పద్మ,
గిరిజన పాఠశాల వర్కర్, మన్ననూర్
మేమంతా 15 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతాలు మాత్రం పెరగలేదు. గతంలో నెలకు రూ. 13,500 ఉంటే, జీఓ 64 వచ్చిన తర్వాత రూ. 11,700కి తగ్గింది. కనీస వేతన చట్టం అమలుచేసి మాకు టైం స్కేల్ వర్తింపజేయాలి. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు ఇవ్వాలి.
– ఓంప్రకాశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి,
డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్
జిల్లాలోని 29 ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు మార్చి నెల వరకు వేతనాలు సక్రమంగా అందాయి. వారికి అవసరమైన బడ్జెట్ కూడా ఉంది. ఇటీవల ప్రభుత్వం ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో తెచ్చిన మార్పుల కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. త్వరలోనే వారి సమస్యలు పరిష్కారమవుతాయి. కార్మికుల సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.
– ఫిరంగి,
జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి

కుటుంబ పోషణ భారంగా మారింది..