
నష్టపరిహారంపై అందేనా..
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాటకంగా వర్షం కురిసింది. అత్యధికంగా ఊర్కొండ మండలంలో 62 మి.మీ., వర్షపాతం నమోదైంది. ఉప్పునుంతల, వంగూరు, కల్వకుర్తి, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, అచ్చంపేట, చారకొండ, వెల్దండ మండలాల్లో 35 మి.మీ., మించి వర్షం కురిసింది. మరోవైపు భారీ వర్షాలతో పంట పొలాల్లో నీరు నిలిచి ఆరుతడి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లుతోంది.
నాగర్‌కర్నూల్ మండలంలో..
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారు. పత్తి, వరి, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలను వర్షపు నీరు ముంచెత్తడం, రోజుల తరబడి పంట నీటిలో మునిగి ఉండటంతో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ మండలంలో 149 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 206 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నట్టుగా నివేదికలో పేర్కొన్నారు. కాగా.. జిల్లాలో అత్యధికంగా 207 ఎకరాల్లో వరి, 103 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది.
జిల్లాలోని చాలా మండలాల్లో వర్షాలకు పంటలు దెబ్బతిన్నా పూర్తిస్థాయిలో అధికారులు గుర్తించనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కోడేరు, లింగాల, తాడూరు, తెలకపల్లి మండలాల్లో మాత్రమే పంటలకు నష్టం వాటిల్లినట్టు నిర్ధారించారు. మిగతా మండలాలకు సంబంధించి పంట నష్టాన్ని అంచనా వేయలేదు. ఇప్పటికే వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులు ప్రభుత్వం అందించే పరిహారంపై ఆశలు పెట్టుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన పంట నష్టపోయిన వారికి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
మండలం వర్షపాతం
ఊర్కొండ 62.0
ఉప్పునుంతల 60.8
వంగూరు 59.8
కల్వకుర్తి 46.3
పెద్దకొత్తపల్లి 45.5
కొల్లాపూర్ 40.5
అచ్చంపేట 39.5
చారకొండ 37.5
వెల్దండ 35.5
కోడేరు 28.8
పెంట్లవెల్లి 24.5
బల్మూరు 23.3
పదర 21.3
తాడూరు 16.5
తెలకపల్లి 15.5
నాగర్‌కర్నూల్ 15.5
బిజినేపల్లి 15.5
లింగాల 10.1
జిల్లాలో పంట నష్టం వివరాలు..
జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం
ఊర్కొండ మండలంలో అత్యధికంగా 62 మి.మీ., వర్షపాతం
ఇటీవల వర్షాలకు జిల్లావ్యాప్తంగా 311 ఎకరాల్లో పంటనష్టం