
శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు సిబ్బంది నిరంతరం కృషిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ఏఎస్‌ఐలు ఎస్‌ఐలుగా పదోన్నతి పొందడంతో ఎస్పీ కార్యాలయంలో గురువారం వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎస్‌బీలో పనిచేస్తున్న సీహెచ్ సుధీర్‌కుమార్ ఎస్‌ఐ ప్రమోషన్‌తోపాటు గద్వాలకు, చారకొండలో పనిచేస్తున్న అంజయ్య ప్రమోషన్‌తోపాటు మహబూబ్‌నగర్‌కు, పోలీస్ కంట్రోల్ రూంలో పనిచేసున్న శ్రీనివాసులు ప్రమోషన్‌తోపాటు నారాయణపేటకు బదిలీ అయ్యారన్నారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్‌బీ సీఐ కనకయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రేపు కబడ్డీ జట్ల ఎంపిక
ఉప్పునుంతల: మండలంలోని వెల్టూరు జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో శనివారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల కబడ్డీ జట్లు ఎంపిక చేస్తామని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక కోసం వచ్చే క్రీడాకారులు 2009 నవంబర్ 30లోపు జన్మించి, 55 కిలోల బరువు కలిగి ఉండి.. ఆధార్, ఎస్‌ఎస్‌సీ మెమో, బోనోఫైడ్ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఆర్గనైజింగ్ సెక్రెటరీలు రమేష్ (99516 29694, మోహన్‌లాల్ (99125 24385)లను సంప్రదించాలని సూచించారు.
గాలి కాలుష్యంతో
అనారోగ్య సమస్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: కలుషితమైన గాలిని దీర్ఘకాలంగా పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావం చూపడంతోపాటు శ్వాసకోశ వ్యాధులకు గురవుతారని ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. గురువారం అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి, నీలిఆకాశంపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. వాహనాల వలన, ఇంటి నుంచి వెలువడే చెత్త, పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా కార్బన్ మోనాకై ్సడ్ వంటి ఉద్గారాలు వెలువడం ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుందన్నారు. అసంక్రమిత వ్యాధులైన అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ తదితర వ్యాధులు రావడంతోపాటు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్నారు. ప్రతి ఒక్కరు వాయు కాలుష్యాన్ని నివారించాలని, వాయు కాలుష్యం వల్ల కలిగే నష్టాలపై క్షేత్రస్థాయిలో విస్తృతమైన అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేయాలి