
తీరని యూరియా వెతలు
ఉప్పునుంతల/ బిజినేపల్లి: యూరియా కోసం అన్నదాతలకు వెతలు తీరడం లేదు. స్థానిక పీఏసీఎస్ వద్ద వారం పదిరోజుల నుంచి రైతులు నిత్యం పడిగాపులు కాస్తున్నారు. గురువారం ఒక్కో రైతుకు రెండేసి బస్తాల చొప్పున పీఏసీఎస్ ద్వారా 720 బస్తాలు, గ్రోమోర్ సెంటర్ ద్వారా 286 బస్తాలు పంపిణీ చేశారు. ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు 13,000 యూరియా బస్తాలు రైతులకు అందజేశామని మండల వ్యవసాయధికారి రమేష్ తెలిపారు. అయితే పంటలకు మోతాదుకు మించి అధికంగా యూరియా వేసుకుంటే వచ్చే అనర్థాలను వివరించినా రైతులు వినడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బిజినేపల్లిలోని యూరియా విక్రయ కేంద్రాన్ని గురువారం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా విక్రయ కేంద్రాల వద్ద ఏలాంటి ఆందోళనలు లేకుండా చూడాలని స్థానిక పోలీస్ సిబ్బందికి సూచించారు.