
చెరువులు, కుంటలకు జలకళ..
ఈ వానాకాలం సీజన్‌లో అధిక వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు, బోరుబావులు నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలోని మొత్తం 1,056 చెరువుల్లో సుమారు 850 చెరువులు పూర్తిస్థాయిలో నీటితో నిండాయి. గతేడాది వరకు నీరు లేక అడుగంటిన మోటారు బోర్లు ఈసారి భూగర్భజలాల మట్టం పెరగడంతో పునరుజ్జీవం పొందాయి. జిల్లాలోని సుమారు 67 శాతం భూభాగంలో నీటిమట్టం భారీగా పెరిగి 5 మీటర్ల కన్నా తక్కువ లోతులోనే భూగర్భజలాలు లభ్యమవుతున్నాయి. ప్రధానంగా పెంట్లవెల్లి, కోడేరు, కొల్లాపూర్, తాడూరు, పెద్దకొత్తపల్లి, వంగూరు, లింగాల, చారకొండ, తిమ్మాజిపేట, అమ్రాబాద్, తెలకపల్లి మండలాల్లో భారీస్థాయిలో భూగర్భజలాలు పైకి ఉబికివచ్చాయి.