
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు
తెలకపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కార్వంగ గ్రామంలో పల్లె దవాఖానా ప్రారంభించి, సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి నియోజకవర్గానికి అదనంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవికుమార్, నాయకులు గోపాస్ చిన్న జంగయ్య, యాదయ్య, మధు, బండ పర్వతాలు, వైద్యులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలు
తెలకపల్లి: మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గోలగుండ నాయకుడు సుధాకర్‌రావు, మదనాపురం గ్రామానికి చెందిన నాగేశ్వర్‌రావుతోపాటు 60 మంది బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు వంశవర్ధన్‌రావు, మాజీ ఎంపీటీసీ ఈశ్వరయ్య, సుమిత్ర, వెంకటయ్యగౌడ్ తదితరలు పాల్గొన్నారు.