
అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఉప్పునుంతల: జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనుల జాతరలో మంజూరైన పనులను శ్రద్ధతో గడువులోగా పూర్తిచేయాలని డీఆర్‌డీఓ చిన్న ఓబులేశ్ సూచించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు కొరటికల్‌లో వన మహోత్సవంలో భాగంగా హరితహారంలో నాటిన మొక్క లు, గతంలో ఉన్న చెట్లను ఆయన పరిశీలించారు. ఈజీఎస్‌లో చేపట్టిన పండ్ల తోటలు, పామాయిల్ తోటలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ ఆర్థిక సంత్సరంలో నిర్దేశించిన విధంగా ఈజీఎస్‌లో కూలీలకు పనులు కల్పించడంతో పాటు పనుల జాతర లో మంజూరైన పశువుల షెడ్లు, ఇతర యూనిట్లను త్వరగా ప్రారంభించి, గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ పర్వతాలు, ఈజీఎస్ ఈసీ కుర్మారెడ్డి, టీఏ సింగోటం, ఫీల్డ్ అసిస్టెంట్లు మల్లయ్య, రమేష్ పాల్గొన్నారు.