మూడేళ్లుగా 18 లక్షల ఎకరాలపైనే | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా 18 లక్షల ఎకరాలపైనే

Sep 11 2025 6:34 AM | Updated on Sep 11 2025 7:07 AM

మూడేళ

మూడేళ్లుగా 18 లక్షల ఎకరాలపైనే

మ్మడి పాలమూరు జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించి మొత్తంగా అన్ని పంటలు కలిపి 18 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యాయి. మూడేళ్లుగా కొంత అటు ఇటుగా స్వల్పంగా లెక్కలు మారుతూ వస్తున్నాయి. 2023లో 18,24,268 ఎకరాలు కాగా.. 2024లో 18,11,953 ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సాగు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 18,07,052 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అదును దాటే సమయానికి అంటే వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలో మరో 50 వేల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

● ఉమ్మడి జిల్లాలో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఏటేటా వీటి సాగు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. వరి 2023 ఖరీఫ్‌ సీజన్‌లో 7,76,311 ఎకరాలు, గతేడాదిలో 8,09,784 ఎకరాల్లో సాగు కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 7,90,515 ఎకరాల్లో సాగైంది. మరో 50 వేల ఎకరాల్లో వరి సాగు కానుండగా.. 8.40 లక్షల ఎకరాలకు చేరుకోనుంది.

● ఉమ్మడి పాలమూరులో 2023లో 6,67,824 ఎకరాల్లో, 2024లో 6,04,004 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈ ఏడాది 7,05,739 ఎకరాల్లో రైతులు తెల్లబంగారం పంట వేశారు. గతేడాదితో పోలిస్తే 1,01,735 ఎకరాల్లో పత్తి సాగు పెరిగినట్లు తెలుస్తోంది.

● ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2023 వానాకాలంలో 1,00,816 ఎకరాల్లో, 2024లో 85,476 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగుచేశారు. ఈ ఏడాది ఇదే సీజన్‌లో 1,09,708 ఎకరాల్లో మొక్కజొ న్న సాగైంది. గతేడాదితో పోలిస్తే 24,232 ఎకరాల్లో మొక్కజొన్న సాగు పెరిగినట్లు స్పష్టమవుతోంది.

● గతేడాదితో పోలిస్తే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 28,634 ఎకరాల్లో పంటల సాగు పెరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2,693 ఎకరాల్లో, నారాయణపేట జిల్లాలో 10,256 ఎకరాల్లో అధికంగా పంటలు సాగయ్యాయి. అదే వనపర్తిలో 28,216 ఎకరాల్లో, జోగుళాంబ గద్వాల జిల్లాలో 18,268 ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి.

● గతేడాదితో పోలిస్తే మహబూబ్‌నగర్‌ జిల్లాలో పత్తి సాగు స్వల్పంగా తగ్గింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 40 వేలకు పైగా, గద్వాల జిల్లాలో 50 వేలకు పైగా ఎకరాల్లో అధికంగా రైతులు సాగు చేశారు. మొక్కజొన్నకు సంబంధించి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గతేడాది కంటే 14 వేల ఎకరాల్లో, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 10 వేల ఎకరాల్లో అధికంగా సాగైంది.

పదేళ్ల క్రితం ఎటు చూసినా ఎండిన పంటలు.. బీళ్లుగా మారిన భూములు. ఫలితంగా ఉపాధి కోసం కుటుంబాలతో సహా తట్ట, బుట్ట, పార పట్టుకుని ముంబై, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు బస్సుల్లో కిక్కిరిసి వెళ్తున్న హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంటాయి. అలా వలసలకు కేరాఫ్‌గా నిలిచిన పాలమూరు జిల్లా హరితవనంగా మారింది. సాగునీరు లేక నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంట పండుతోంది. ఏటేటా సాగు గణనీయంగా పెరుగుతుండగా.. భూమికి పచ్చని రంగు వేసినట్లు కొత్త శోభను సంతరించుకుంది.

– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

మూడేళ్లుగా 18 లక్షల ఎకరాలపైనే
1
1/1

మూడేళ్లుగా 18 లక్షల ఎకరాలపైనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement