
జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి
అచ్చంపేట రూరల్: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట సివిల్ కోర్టు జడ్జి స్పందన కోరారు. బుధవారం పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చన్నారు. ఈ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఏపీపీఓ మురళీమోహన్, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు నాగరాజు, శంకర్, ఎస్‌ఐలు విజయభాస్కర్, పవన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, రాజేందర్, సద్దాం, గిరిమనోహర్‌రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ రమేష్, తిరుపతి, నరేందర్, ఊషన్న, పాండు, భాస్కరాచారి, రవి తదితరులు పాల్గొన్నారు.