
ఆలయాల మూసివేత
అచ్చంపేట రూరల్/వెల్దండ: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం 7గంటల వరకు ఆలయాన్ని మూసి ఉంచనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
● వెల్దండ మండలం గుండాలలోని శ్రీఅంబా రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 2గంటలకు మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం ద్వార బంధనం చేశారు. సోమవారం తెల్లవారుజామున 5గంటలకు గణపతిపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం పూజలు, సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
ప్రాథమిక విద్యను
బలోపేతం చేయాలి
కందనూలు: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి.. ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని ఎస్‌జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల్లో వలంటీర్లను నియమించి.. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున కేటాయించాలన్నారు. అనంతరం ఇటీవల పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు. కాగా, ఎస్‌జీటీయూ జిల్లా అధ్యక్షుడిగా టి. రమేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, యూనియన్ నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, రాజేశ్, సతీశ్, రాజేందర్‌రెడ్డి, వెంకటేశ్వర శెట్టి, వనజ, చేతనప్రియ పాల్గొన్నారు.

ఆలయాల మూసివేత

ఆలయాల మూసివేత