
న్యూస్‌రీల్
జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ రెఫరీగా బాబునాయక్
అచ్చంపేట రూరల్: మండలంలోని దేవులతండాకు చెందిన సీనియర్ క్రీడాకారుడు బాబునాయక్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ రెఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు అఖిలభారత బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాజారావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24నుంచి 28వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్‌లో జరిగే 71వ సీనియర్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆయన రెఫరీగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఎంపికపై బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌గౌడ్‌తో పాటు పలువురు హర్షం వ్యక్తంచేశారు.
ప్రజా సమస్యలపై
నిరంతర పోరాటం
నాగర్‌కర్నూల్ రూరల్: ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతర పోరాటం సాగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని లక్ష్మణాచారి భవన్‌లో నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజా సంఘాలు సిద్ధం కావాల్సిన అవసరముందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని.. వాటిని సరి చేయకపోతే సీపీఐ పక్షాన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కమ్యూనిస్టులు ఎన్నికలప్పుడు మాత్రమే అవసరం.. తర్వాత లేదనే విధంగా జిల్లా మంత్రివర్యులు ప్రవర్తిస్తున్న తీరు సరైంది కాదన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్, నాయకులు కేశవులుగౌడ్, నర్సింహ, పెబ్బేటి విజయుడు, శివశంకర్, కృష్ణాజీ, శ్రీనివాస్, శివుడు, వెంకటయ్య, శంకర్‌గౌడ్, రవీందర్, ఇందిరమ్మ, లక్ష్మీపతి తదితరులు ఉన్నారు.
రామన్‌పాడులో
పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం సముద్ర మట్టానికి పైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 920 క్యూసెక్కుల వరద జ లాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వ లో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా జ లాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూ సెక్కు లు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసె క్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.

న్యూస్‌రీల్