నాగర్‌కర్నూల్: రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని వేగంగా సేకరిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రైల్వే, రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు, వనరుల నిర్మాణాలు, అభివృద్ధికి కావాల్సిన భూ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావుతో కలిసి వివిధ జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఢిల్లీ రాష్ట్రపతి భవనం నుంచి కేంద్ర ప్రభుత్వం కేబినేట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.అమరేందర్‌తో కలిసి కలెక్టర్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల పరిధిలో 142.98 ఎకరాలు అవసరం కాగా ఇప్పటివరకు 129.52 ఎకరాల భూమిని సేకరించామని, ఇంకా 18.48 ఎకరాల భూమిని రానున్న నెల రోజుల్లో సేకరించిప్రాజెక్టు నిర్మాణానికి అందజేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
జిల్లా మండల కేంద్రంలోని శ్రీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన పాఠశాల పరిసరాలను పరిశీలించి, మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది, స్థానిక అధికారులు ఉన్నారు.
కలెక్టర్ బదావత్ సంతోష్