
రికార్డులు మా వద్దే ఉన్నాయి..
జిల్లా మత్స్య సహకార సంఘం సంబంధించి బుక్ ఆఫ్ రికార్డులు, వాటా, తీర్మానాలు, బైలా, క్యాష్ పుస్తకాలు నా వద్దే ఉన్నాయి. ఎక్కడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేవు. రికార్డులు మాయం అయ్యాయని చెప్పడం అవాస్తవం. మత్స్య శాఖ ఏడీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. రికార్డుల్లో పేర్కొన్న విధంగా చెరువుల్లో చేపల పంపిణీ చేపట్టలేదు. నమోదు చేసిన దానికన్నా తక్కువ సంఖ్యలో చేపలను వదిలి అక్రమాలకు పాల్పడ్డారు.
– వాకిటి ఆంజనేయులు,
చైర్మన్, జిల్లా మత్స్య సహకార సంఘం
గతేడాది చేప పిల్లల పంపిణీలో అక్రమాలు జరిగాయి. రికార్డుల్లో 1.30 లక్షల చేపలు ఉంటే చెరువులో 30 వేల చేపపిల్లలే పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన రికార్డులు అడిగితే ఇవ్వలేదు. బ్యాంకుఖాతాలో డబ్బులు దుర్వినియోగం చేశామన్నది అవాస్తవం. సభ్యత్వాలకు సంబంధించిన డబ్బులు జాయింట్ బ్యాంకు ఖాతాలోనే ఉన్నాయి.
– సత్యనారాయణ, డైరెక్టర్,
జిల్లా మత్స్య సహకార సంఘం

రికార్డులు మా వద్దే ఉన్నాయి..