
ఫేస్.. భేష్
సమాచారం లేకుండానే..
●
జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్న ‘ముఖగుర్తింపు’ హాజరు
కందనూలు: ప్రభుత్వ పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది అనధికారిక గైర్హాజరుకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్) జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. పాఠశాల విద్యాశాఖ ఈ నెల 1 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ హాజరును క్రమం తప్పకుండా నమోదు చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 816 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 3,962 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. వీరిలో 3,946 మంది ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా తమ హాజరును నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గత శనివారం 3,146 మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కాగా, 324 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 468 మంది సెలవుల్లో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 79.72 శాతం హాజరును బట్టి పారదర్శకతను సూచిస్తున్నాయి.
గతంలో కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కాకుండా, రిజిష్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయేవారు. కొందరు ప్రైవేటు పాఠశాలల నిర్వహణ, రియల్ ఎస్టేట్, ఇతరత్రా వ్యాపారాలు చేసుకునేవారు. పట్టణ, నగర ప్రాంతాల్లో నివసిస్తున్న వారే ఎక్కువ. దీంతో మారుమూల గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు ఆలస్యంగా రావడం, సాయంత్రం ముందుగానే ఇంటిముఖం పట్టడం వంటివి పరిపాటిగా మారింది. సమీపంలో ఉన్న ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించడం విస్మరించారు. ముందస్తు సమాచారం లేకుండానే విధులకు గైర్హాజరైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమలులోకి వచ్చాక గైర్హాజరును నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ విధానం పాఠశాలకు 100 మీటర్ల పరిధిలోనే పనిచేస్తుంది. దీంతో ఉపాధ్యాయులు హాజరును నమోదు చేసుకోవడానికి తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం, సాయంత్రం హాజరు నమోదు చేయడంతో ఉపాధ్యాయుల బాధ్యతను పెంచింది.
ఉపాధ్యాయుల
పారదర్శకతకు
బాసటగా నిలుస్తున్న ప్రక్రియ
పాఠశాలకు
100 మీటర్ల పరిధిలోనే
పనిచేస్తుండటంతో
తప్పనిసరిగా రాక
మెరుగుపడిన
సమయపాలన,
తరగతుల నిర్వహణ
గైర్హాజరుకు చెక్ పెడుతున్న
విద్యాశాఖాధికారులు

ఫేస్.. భేష్