
కేంద్రం పరిశీలనలో..
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారి ఏర్పాటు, వంతెన నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లాం. ముబాయి, బెంగుళూరు జాతీయ రహదారులను కలుపుతూ ఏర్పాటవుతున్న చించోలి– భూత్పూర్–167 అనుసంధానంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. మొదటి దశలో చించోలి రహదారిని మన్ననూర్ వరకు విస్తరించాలనే ప్రతిపాదనలను కేంద్రానికి పంపించారు.
– నరేందర్‌రావు,
బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్
మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి ఆవశ్యకత గురించి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే వంతెన, రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇది నల్లమల ప్రజల చిరకాల ఆంకాక్ష నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంలో చేర్చడంతో కేంద్రం పరిశీలనలో ఉంది.
– వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై మద్దిమడుగు వద్ద వంతెన అవసరం గుర్తించాం. ఇప్పటికే కొత్త జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. జాతీయ రహదారి– 44 నుంచి నాగర్‌కర్నూల్, అచ్చంపేట, మద్దిమడుగు మీదుగా ఏపీలోని చిరిగిరిపాడు(మాచర్ల) వరకు 165 కి.మీ., రోడ్డును ప్రతిపాదించాం. ఈ రోడ్డు మార్గంలో కృష్ణానదిపై వంతెన ఏర్పాటు ఉంది. – మల్లురవి, ఎంపీ, నాగర్‌కర్నూల్
●

కేంద్రం పరిశీలనలో..

కేంద్రం పరిశీలనలో..