
రాష్ట్రం దాటుతున్న యూరియా
పెంట్లవెల్లి: రాష్ట్రంలో యూరియా కొరత ఉండడంతో ఎంతోమంది రైతులు ఇబ్బందులు పడుతూ రోడ్లపై ధర్నాలు చేస్తూ, రాస్తారోకోలు చేస్తున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని సొసైటీ నుంచి మంచాలకట్ట మీదుగా రాయలసీమకు కృష్ణానదిపై రోజూ వందలాది యూరియా సంచులను ఇంజిన్‌బోటు ద్వారా యేరు దాటిస్తున్నారు కొంతమంది దళారులు. గతంలో కూడా పలుమార్లు యూరియాను దాటిస్తే సొసైటీకి తెలియజేసినా చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా యథావిధిగా యూరియాను యేరు దాటిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.