
ఉత్సాహంగా గణనాథుడి నిమజ్జనోత్సవం
గణేశ్ నిమజ్జనంలో పాల్గొన్న
ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
కందనూలు: జిల్లాకేంద్రంలో ఆదివారం గణేశ్ నిమజ్జనోత్సవం ఉత్సాహంగా సాగింది. పట్టణంలోని పలు వినాయకులను ఆదివారం ఐదోరోజు నిమజ్జనం చేయడానికి ప్రధాన వీధుల వెంట డప్పులతో నృత్యాలు చేస్తూ, భజనలతో యువకులు కేసరిసముద్రం చెరువులో గణేశ్‌లను నిమజ్జనం చేశారు. జిల్లాకేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు.