పరేషాన్‌లో డీలర్లు | - | Sakshi
Sakshi News home page

పరేషాన్‌లో డీలర్లు

Aug 31 2025 1:09 AM | Updated on Aug 31 2025 1:09 AM

పరేషా

పరేషాన్‌లో డీలర్లు

5 నెలలుగా అందని కమీషన్‌ ఎదురుచూస్తున్నాం.. నివేదికలు పంపించాం..

చౌకధర దుకాణాల నిర్వహణకు తప్పని అవస్థలు

జిల్లాలోని డీలర్లకు

రూ. 3.80 కోట్లు పెండింగ్‌

రేషన్‌ డీలర్లు ఐదు నెలలుగా కమీషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. సకాలంలో కమీషన్‌ ఇవ్వకపోవడంతో డీలర్లపై ఆర్థిక భారం, ఒత్తిడి పెరుగుతుంది. కమీషన్‌ విడుదల చేయడంతో పాటు డీలర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి.

– సాదిక్‌పాషా,

రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

రేషన్‌ డీలర్ల కమీషన్‌కు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపించడం జరిగింది. డీలర్ల కమీషన్‌ విడుదలకు సబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఎంత కమీషన్‌ రావాలనే వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయి.

– నర్సింహారావు,

జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి

3న సీఎం రేవంత్‌ రాక

అడ్డాకుల: మూసాపేట మండలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఖరారైంది. వచ్చే నెల 3న వేముల శివారులోని ఎస్‌జీడీ ఫార్మా వద్ద కొత్తగా ఏర్పాటుచేసిన రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. అదేవిధంగా మూసాపేటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం మహబూబ్‌నగర్‌ ఎస్పీ జాన కి, ఎమ్మెల్యే జి.మధుసూ దన్‌రెడ్డి పరిశీలించారు.

నాగర్‌కర్నూల్‌: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతినెలా లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు అందించే డీలర్లకు కష్టాలు తప్పడం లేదు. 5నెలలుగా రేషన్‌ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్‌ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమీషన్‌ చెల్లించాలని ఉన్నతాధికారులను కోరుతున్నా ఫలితం లేకుండా పోతుందని రేషన్‌ డీలర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అప్పులు చేసి రేషన్‌ దుకాణాలను కొనసాగించాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. అసలే స్టాక్‌ పాయింట్ల నుంచి వచ్చే బియ్యం బస్తాల్లో చాలా వరకు 1నుంచి 4 కిలోలు తక్కువగా వస్తుండగా.. కమీషన్‌ సైతం ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది.

జిల్లాలో 558 దుకాణాలు..

జిల్లాలో 558 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 2,64,174 రేషన్‌ కార్డులు ఉండగా.. దాదాపు 8లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతినెలా 5,431 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. క్వింటాకు రూ.1.40 చొప్పున ప్రతినెలా రేషన్‌ డీలర్‌కు కమీషన్‌ ఇస్తున్నారు. జిల్లాలోని డీలర్లకు ప్రతినెలా రూ. 76.03లక్షల కమీషన్‌ అందాల్సి ఉండగా.. ఐదు నెలలుగా చెల్లించకపోవడంతో చౌకధర దుకాణాల నిర్వహణ భారంగా మారింది. సుమారు రూ. 3.80కోట్ల కమీషన్‌ పెండింగ్‌లో ఉండటంతో దుకాణం అద్దె, కరెంటు బిల్లు, హమాలీ, తూకం వేసే సిబ్బంది వేతనాలు చెల్లించేందుకు అవస్థలు పడుతున్నారు.

ఆందోళనకు సిద్ధం

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రేషన్‌ డీలర్లు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. పెండింగ్‌లో ఉన్న కమీషన్‌తో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరుతున్నారు. అయితే వచ్చే నెల 4వ తేదీలోగా రేషన్‌ డీలర్ల కమీషన్‌ ప్రభుత్వం విడుదల చేయకుంటే మరుసటి రోజు 5న ఒక రోజు రేషన్‌ దుకాణాలను బంద్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. వీటితో పాటు పలు డిమాండ్ల సాధనకు దశలవారీ పోరాటాలకు సన్నద్ధమవుతున్నారు.

పరేషాన్‌లో డీలర్లు 1
1/2

పరేషాన్‌లో డీలర్లు

పరేషాన్‌లో డీలర్లు 2
2/2

పరేషాన్‌లో డీలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement