
గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో గణేశ్ నిమజ్జనానికి పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతి పండుగను మతసామరస్యానికి ప్రతీకగా అన్నివర్గాలు నిర్వహించుకుంటున్నాయని.. గణేశ్ ఉత్సవాలను కూడా ప్రశాంత వాతావరణంలో పూర్తిచేయాలన్నారు. గణేశ్ నిమజ్జనంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అన్నారు. జిల్లాలో 2వేల విగ్రహాలను ప్రతిష్ఠించారని.. అన్నింటికీ జియోట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు. తొమ్మిది రోజుల్లో నిమజ్జనాన్ని పూర్తిచేయాలని నిర్వాహకులకు సూచించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ఉన్నారు.
● సమాజంలో ప్రతి ఒక్కరూ పేదలకు అండగా నిలువాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లో శనివారం కై ండ్‌నెస్ వాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎంతో మంది ఎన్నో వస్తువులను నిరుపయోగంగా పడేస్తుంటారని, అలాంటి వాటిని సేకరించి పేదలకు పంచాలన్న ఉద్దేశంతో కై ండ్‌నెస్ వాల్ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.