
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
చారకొండ: స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని డీపీఓ శ్రీరాములు అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని సారంబండతండా, కమాల్‌పూర్, గైరాన్‌తండా పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. అన్ని గ్రామపంచాయతీల్లో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా ర్యాంపులు, లైటింగ్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని శిథిల ఇళ్లలో నివాసముంటున్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ నారాయణ ఉన్నారు.