
యూరియా కోసం పడిగాపులు
ఉప్పునుంతల: మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం వద్ద శుక్రవారం ఉదయం నుంచే రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. గురువారం యూరియా అందని రైతులు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. స్టాక్ ఉన్న 150 బస్తాలను ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేయడంతో చాలా మంది రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇంతకు ముందు ఆగ్రో రైతు సేవాల కేంద్రాలకు యూరియా సరఫరాను ఇచ్చిన అధికారులు ప్రస్తుతం కేవలం పీఏసీఎస్‌కు మాత్రమే ఇవ్వడంతో అవసరానికి సరిపడా యూరి యా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం 580 బస్తాలు రావడంతో రెండు రోజులపాటు రైతుకు రెండేసి బస్తాల చొప్పున యూరియాను పంపిణీ చేశామని పీఏసీఎస్ సీఈఓ రవీందర్‌రావు తెలిపారు.