
ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
కందనూలు: ప్రతి క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం అన్నారు. శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల అభిరుచిని పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో క్రీడలను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖాజా నజీమ్ అలీ, విద్యార్థులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.