
విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలి
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రెటరీ నసీం సుల్తానా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతి బాల కల్యాణ ఆశ్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆశ్రమంలోని వంటగది, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండకూడదని, ముఖ్యంగా సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని, పరీక్షల్లో మార్కులు సాధించాలన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని ఇతరులకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆశ్రమ ఇన్‌చార్జ్ నారాయణరెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు శ్రీశైలం, మల్లేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ ఢిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు పవనశేషసాయి పాల్గొన్నారు.