
సర్కార్ చదువే మేలు..
బాధ్యతలు చేపట్టిన రిజిస్ట్రార్
బహిరంగ సభకు హాజరైన ప్రజలు, మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, ఎంపీ మల్లురవి, ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
● పిల్లలను చేర్పించేందుకు
ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు
● బడిబాటలో 12,712 విద్యార్థుల చేరిక
● మూతబడిన పాఠశాలలపై
ప్రత్యేక దృష్టి
● ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో
సత్ఫలితాలు
అచ్చంపేట: రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. బడుల్లో అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యా బోధన, కృతిమ మేధ(ఏఐ), అనుభవజ్జలైన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్య, రాత పుస్తకాలు ఉచితంగా అందిస్తుండడంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 940 పాఠశాలలో గడిచిన మూడేళ్లలో దాదాపు 11,036 ప్రవేశాలు తగ్గాయి. విద్యార్థుల నమోదు తగ్గుతుండటంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లావ్యాప్తగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 12,712 మంది విద్యార్థులు చేరారు. 2024–25 విద్యా సంవత్సరంలో 73,190 మంది విద్యార్థులుండగా.. 2025–26 లో ఆ సంఖ్య 75,347కు చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
తెరుచుకున్న 24 పాఠశాలలు
ఈ విద్యా సంవత్సరం నుంచి మూతపడిన పాఠశాలలు అనేది ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో గతేడాది జీరో ఎన్‌రోల్‌మెట్‌గా ఉన్న 84 స్కూళ్లు మూతపడగా.. ఈ ఏడాది వాటిలో 24 పాఠశాలలు తెరుచుకున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాల 1, డీఎన్‌టీ పాఠశాలలు 6, టీడబ్ల్యూపీఎస్ 1, మండల పరిషత్ పాఠశాలలు 49, ఎయిడెడ్ పాఠశాలు 3 చొప్పున విద్యార్థుల నమోదు లేక తెరుచుకోలేదు.
పాయింట్ల పద్ధతికి ప్రయత్నం..
ఈ విద్యా సంవత్సరం పాఠశాలల వారీగా ఏ ఉపాధ్యాయుడు ఎక్కువ మంది పిల్లల్ని బడిలో చేర్పిస్తారో వారికి పాయింట్లు ఇచ్చి సర్వీస్ పుస్తకంలో నమోదు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సమయంలో ఈ పాయింట్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో పిల్లల నమోదుపై దృష్టి సారించి, ప్రభుత్వ పాఠశాలలో ఉండే వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో సఫలమయ్యారు.
జిల్లాలో ఇలా..
పాఠశాల ఉపాధ్యాయులు
జిల్లా, మండల 3,513
పరిషత్ పాఠశాలలు
కేజీబీవీ 298
రెసిడెన్సియల్ 855
సంవత్సరం విద్యార్థులు
2022–23 84,226
2023–24 78,265
2024–25 73,190
2025–26 75,347
అచ్చంపేట రూరల్: పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ రోడ్డు గుండా శ్రీశైలం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాలకు అధికంగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో పాలకులు, అధికారులు పోస్టాఫీసు చుట్టు పక్కల ఉన్న డబ్బాలను తొలగించారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. అక్కడ చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి నచ్చజెప్పి పంపించారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట, చుట్టు పక్కల ఉన్న డబ్బాలను తొలగించారు.
ఆ ప్రాంతాలనే ఆక్రమించారు
పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, లింగాల రోడ్డు, పోస్టాఫీసు కార్యాలయం చుట్టు పక్కల ఉన్న స్థలాల్లో డబ్బాలను తొలగించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాయి. కానీ ఆ ప్రాంతాలనే ప్రస్తుతం కొందరు ఆక్రమించి, అదెకిస్తూ సంపాదిస్తున్నారు. పండ్లు, ఇతర వ్యాపారాలను సాగిస్తున్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయంతో పాటు, సివిల్ కోర్టు ఉండటంతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. చౌరస్తాలో యూ టర్న్ తీసుకోవాలంటే నరకమే. అటు, ఇటుగా వాహనాలు రావడంతో పాటు టర్నింగ్‌లోనే పోస్టాఫీసు ఎదుట ఆక్రమించిన స్థలంలోనే వ్యాపారం కొనసాగిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అద్దె వసూలు
పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట దుకాణ సముదాయాలు ఉన్నాయి. వాటి ముందు చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి నుంచి ప్రతి నెల అద్దె వసూలు చేస్తున్నారు. పండ్లు, పూలు, చాట్‌బండార్, మిర్చి, కూల్‌డ్రింక్స్, ఇతర వ్యాపారాలు చేసే వారు తోపుడు బండ్లను దుకాణాల ముందు ఉంచితే వారి నుంచి దర్జాగా అద్దె వసూలు చేస్తున్నారు. వారంతా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గతంలో డబ్బాలను తీసేయగా.. ప్రస్తుతం తోపుడు బండ్లు డ్రెయినేజీపై ఉంచి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అలాగే కూరగాయల మార్కెట్‌లో సమస్యను చెప్పనక్కర్లేదు. దుకాణాల ఎదుట చిన్న వ్యాపారాలు చేస్తుండటంతో నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంటుంది.
రోడ్లపైనే మురుగు
పాతబస్టాండు, నెహ్రూ చౌరస్తాలో డ్రెయినేజీలోని పూడిక తీయడం సాధ్యంకాక పేరుకుపోతుంది. వర్షాల సమయంలో వరదంతా రహదారిపైనే పారుతుంది. లోతట్టు ప్రాంతాల్లోని దుకాణాల్లోకి నీరు చేరుతుంది.
చిరుతను
పట్టుకునేందుకు
ప్రత్యేక రెస్క్యూ బృందం
● గాలింపు చర్యలు ప్రారంభం
మెట్టుగడ్డ: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికారి రిజిస్ట్రార్ ఫణీందర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్‌లతో సమావేశం నిర్వహించారు. మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సబ్ రిజిస్ట్రార్‌లకు సూచించారు. జూన్ 30న జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ పదవీ విరమణ పొందడంతో ఇప్పటి వరకు ఈ స్థానం ఖాళీగానే ఉంది. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా రిజిస్ట్రార్‌కు మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
అచ్చంపేటలో రోడ్డు స్థలాల ఆక్రమణలు
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
పట్టించుకోని పాలకులు,
మున్సిపల్ అధికారులు
సమస్యను పరిష్కరిస్తాం...
పట్టణంలోని ఆక్రమణలపై కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తాం. కౌన్సిల్ తీర్మాణం ప్రకారం టౌన్‌ప్లానింగ్ అధికారికి చెబుతాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. తాను ఇటీవలి కాలంలోనే బాధ్యతలు చేపట్టాను. రోడ్లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం.
– మురళి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట
జిల్లావ్యాప్తంగా..
జిల్లా, మండల పరిషత్ పాఠశాలలు 816, కేజీబీవీలు 20, ఎయిడెడ్ పాఠశాలలు 13, మోడల్ స్కూళ్లు 2, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల 1, జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లు 60, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 39, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 15 మినీ గురుకులాలు 3, బీసీ గురుకులాలు (ఎంజీపీటీ) 12 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (టీజీఎస్‌డబ్ల్యూ) పాఠశాలలు 14, సీబీఎస్‌ఈ పాఠశాల ఒకటి, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు 3 ఉన్నాయి.
అన్ని పాఠశాలలో పెరిగారు..
జిల్లాలో అన్ని ప్రభుత్వపాఠశాలల్లో గతంలో కంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది. మూతపడిన పాఠశాలలను మొదట గుర్తించి ఆ గ్రామాల్లో బడిఈడు పిల్లల్ని చేర్పించారు. దీంతో మూతబడిన 24 పాఠశాలలు తెరుచుకున్నాయి. అక్కడ ఉపాధ్యాయులను నియమించాం. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు బాధ్యతగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల ప్రవేశాలు పెరగడానికి దోహదపడ్డారు.
– రమేష్‌కుమార్, జిల్లా విద్యాధికారి
సామర్థ్యాల పెంపు దృష్టి
ఎన్‌సీఈఆర్టీ, విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సాధన సర్వే (నాస్) జాతీయ సగటుతో పోలిస్తే.. తెలంగాణ ఫలితాలు తక్కువగా ఉన్నాయి. పీజీఐ, అసర్ నివేదికలు వివిధ స్థాయిలో ముఖ్యమైన అభ్యసన సామర్థ్యాల్లో అంతరాలు చూపించాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాల పెంచేలా సాధికారికత కల్పించడం, వినూత్న వ్యూహాలు, ప్రభావవంతమైన బోధన పద్ధతులపై దృష్టి పెట్టేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.

సర్కార్ చదువే మేలు..

సర్కార్ చదువే మేలు..

సర్కార్ చదువే మేలు..

సర్కార్ చదువే మేలు..

సర్కార్ చదువే మేలు..