
1987లో ఇంటిజాగ కొన్నాం..
మేము 1987లో బుచ్చి రెడ్డి వద్ద ఇంటిజాగ కొనుకున్నాం. ఇందు కు సంబంధించి పత్రా లు రాయించుకుని ఇళ్లు కట్టుకున్నాం. అప్పటినుంచి ఇంటిపన్ను గ్రామపంచాయతీకి చెల్లిస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అనడం ఎక్కడి న్యాయం.
– బత్తుల బాలింగయ్య, పదర
న్యాయం చేయాలి..
గ్రామ శివారులోని ఊరబావిచెల్కలో ఉన్న భూమిని 30ఏళ్ల క్రితం మేం అందరం కొనుగోలు చేసి ఇళ్లను కట్టుకున్నాం. ఏళ్లుగా పన్నులు చెల్లిస్తూ ఈ ఇళ్లలోనే ఉంటున్నాం. ఇప్పుడు నోటీసులు పంపి ఇళ్లను ఖాళీచేయాలని అంటున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
– కడారి బాలయ్య, పదర
రికార్డుల్లో ఇళ్ల స్థలాలుగానే ఉంది..
పదర మండల కేంద్రంలోని ఊరబావిచెల్క భూములపై కేసు నడుస్తోంది. ఆ కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సదరు భూమిలో ఇళ్ల స్థలాలు ఉన్నట్టు నమోదై ఉంది. గ్రామపంచాయతీ రికార్డుల్లోనూ ఇళ్ల స్థలాలుగానే ఉంది.
– సురేశ్‌బాబు, తహసీల్దార్, పదర
●

1987లో ఇంటిజాగ కొన్నాం..