
నాగర్‌కర్నూల్
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
వివరాలు 8లో u
● ప్రశ్న: ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మురుగు కాల్వ నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేయడం లేదు. హిందూ శ్మశాన వాటికలో నిర్మించిన దహన వాటికను వినియోగంలోకి తేవాలి. ఏపుగా పెరిగిన కంప చెట్లు తొలగించండి.
– మండికారి బాలాజీ, పట్టణవాసి
● కమిషనర్: డ్రెయినేజీ నిర్మాణానికి రూ.8 లక్షల నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. శ్మశాన వాటికలో కంప చెట్లు తొలగించి దహన వాటికను వినియోగింలోకి తెస్తాం.
న్యూస్‌రీల్
ప్రశ్న: లింగాల రోడ్డులో పాత ఆంధ్రాబ్యాంకు రోడ్డు, 9వ వార్డులో కుక్కల బెడద అధికంగా ఉంది. పిల్లల వెంట పడుతున్నాయి. వారం రోజులకోసారి కూడా చెత్తబండ్లు రావడం లేదు. వారం రోజులుగా తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. ఖాళీ ప్లాట్లలో చెత్త వేస్తున్నారు.
– భాస్కర్‌రెడ్డి విద్యానగర్‌కాలనీ, జంగమ్మ 9వ వార్డు
కమిషనర్: వీధికుక్కల నియంత్రణకు జిల్లాకేంద్రంలో ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక బృందం ద్వారా త్వరలోనే కుక్కలను పట్టుకుంటాం. ఇకపై రెగ్యులర్‌గా చెత్త ఆటోలు వస్తాయి. ఖాళీ ప్లాట్లలో చెత్త వేయకుండా చెత్త ఆటోల ద్వారా మైకులో ప్రచారం చేస్తాం. ఎవరి ప్లాట్లు వారే శుభ్రం చేసుకోవాలి.

నాగర్‌కర్నూల్