
18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక
పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోల్ గ్రామం సర్వే నంబర్లు 147, 508లో 22 ఎకరాలలో నిర్మించిన రెసిడెన్సియల్ స్కూల్‌ను ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహించనుండటంతో సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ముందుగా హెలీప్యాడ్, సభావేదిక, పార్కింగ్ వంటి స్థలాలను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. అధికారులు క్షేత్రస్థాయిలో దగ్గరుండి మూడు రోజుల్లో పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. అసంపూర్తి పనులు మరింత ముమ్మరం చేయాలని జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. అలాగే మండల రెవెన్యూ, ఇతర అధికారులు సభా స్థలాన్ని పరిశీలించాలని చెప్పారు. ఈ క్రమంలోనే మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థల పరిశీలన చేస్తారని, ఆలోగా పనులు కొలిక్కి వచ్చేలా చూడాలన్నారు. సభావేదిక ఏర్పాట్లు, ఇతర పనుల్లో ఎలాంటి అలసత్యం వహించరాదని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ విజయసింహ, ఎంపీడీఓ దేవేందర్ ఉన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్