
జలాశయానికి గండి..
ఇంతటి ప్రాధాన్యత ఉన్న ర్యాలంపాడును గుత్తేదారు చేపట్టిన లోపభూయిష్టమైన నిర్మాణం, కొరవడిన అధికారుల పర్యవేక్షణతో ఏకంగా జలాశయానికి గండిపడింది. జలాశయం అడుగుభాగాన రాక్‌టోల్ నుంచి పలుచోట్ల లీకేజీలు ఏర్పడి జలాశయం నుంచి నీరు బయటకు ఉబికి వస్తుండడాన్ని ఇరిగేషన్ అధికారులు మూడేళ్ల కిందటనే గుర్తించారు. తర్వాత సీఈ స్థాయిలో నిపుణుల కమిటీ జలాశయాన్ని సందర్శించి లీకేజీలు, అందుకు గల కారణాలు తెలుసుకొని, మరమ్మతు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు సర్వే పనులు అప్పగించింది. ఇందుకోసం రూ.57లక్షలు వెచ్చించారు.