
భూగర్భజలాల పెంపునకు కృషి చేయాలి
వెల్దండ: ఉపాధి హామీ పథకం ద్వారా భూగర్భజలాల పెంపునకు దోహదపడే పనులు చేపట్టాలని కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి అథర్వ పవస్ అన్నారు. గురువారం మండలంలోని చెదురుపల్లి బుగ్గకాల్వ చెరువులో చేపట్టిన ఒండ్రుమట్టి తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం చెరువులో మట్టి తీయడం వల్ల వర్షాకాలంలో ఎంతమేర నీరు చేరిందనే దానిపై పరిశీలన చేశారు. ఉపాధి హామీ పథకం రైతులు, ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలని సూచించారు. ముఖ్యంగా భూగర్భజలాల పెంపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ చంద్రశేఖర్, క్రాంతికుమార్, పవన్, ఇన్‌చార్జి ఎంపీడీఓ లక్ష్మణ్, ఏపీఓ ఈశ్వర్‌జీ, దేవేందర్, మంజుల పాల్గొన్నారు.