
సమాజానికి మంచి..
బాదేపల్లిలోని శ్రీసాయినగర్ కాలనీకి చెందిన నరేష్, వీణ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆస్తులు ఉన్నా అధిక సంతానం అనర్థానికి దారి తీస్తుందన్నది వీరి అభిప్రాయం. ఇద్దరికి చక్కటి విద్యను అందించగలిగితే వారు ఉన్నత స్థాయికి ఎదగడంతోపాటు సమాజానికి మంచి చేస్తారని భావిస్తున్నారు. అధిక జనాభా వలన మౌలిక సదుపాయాల కల్పన, పర్యవేక్షణ, క్రమశిక్షణ గాడి తప్పుతుందని, పాలనాపరమైన సమస్యలు ఎదురవుతాయని, సరైన సేవలు, సౌకర్యాలు అందక ఆందోళనలు చోటు చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని పేర్కొంటున్నారు.