
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నాగర్‌కర్నూల్ రూరల్: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారిణి రజిని సూచించారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో గురువారం జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేపల సీడ్ ఉత్పత్తి, పెంపకం, చేపల మార్కెటింగ్ తదితర అంశాలపై మత్స్యకారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. చేపల రైతులు ఆక్వా కల్చర్ నిపుణుల సూచనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో మత్స్యసహకార సంఘాల మండల అధ్యక్షుడు హరికృష్ణ, తెప్ప రుద్రయ్య పాల్గొన్నారు.