
ముగ్గురు పిల్లలుకావాలనుకుంటున్నాం..
గత మే నెల 14న మాకు వివాహమైంది. నేను డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ.. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేస్తాను. నా భార్య డిగ్రీ చదువుతోంది. ప్రతి ఇంట్లో ఒక్కరే పిల్లలు ఉంటున్నారు. ఈ విషయమై మేము ముగ్గురు పిల్లలను కనాలని భవిష్యత్ ప్లాన్ చేసుకున్నాం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కావాలనుకున్నాం. ఒక్కొక్కరికి మధ్య కొంత వయస్సు గ్యాప్‌తో పిల్లలను కనాలని భావిస్తున్నాం.
– రాజేష్, మనుశ్రీ, కానాయపల్లి గ్రామం, కొత్తకోట మండలం
భవిష్యత్‌కు ప్రణాళిక..
నాకు ఏడాది కిందట రాయచూరు జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన జయలక్ష్మితో వివాహమైంది. ఇద్దరం ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నాం. మేం రెండేళ్ల తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం. ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా, కుటుంబం జీవన వ్యయం కూడా పెరిగింది. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండటంతో వచ్చిన డబ్బులను ఇప్పటి నుంచే పొదుపు చేసుకుని జాగ్రత్త పడితేనే భవిష్యత్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని తట్టుకోవడానికి సులభం అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నా భార్య నేను కలిసి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు వద్దకున్నాం.
– రమేష్, జయలక్ష్మి, గద్వాల పట్టణం
స్థిరపడిన తర్వాతే పిల్లలు..
మాకు ఇటీవలే వివాహమైంది. అయితే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వ్యాపారంలో స్థిరపడిన తర్వాతే పిల్లలు కనాలన్న ఆలోచనతో ఉన్నాం. ఒకరిద్దరు సంతానం ఉంటే సరిపోతుందని భావిస్తున్నాం. మౌలిక సదుపాయాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర అవకాశాలు పెరుగుతున్న జనాభాతో కోల్పోయే అవ కాశాలు ఉన్నాయి. ఒకరిద్దరి సంతానం ఉంటే వారి పర్యవేక్షణ సులభతరం అవుతుంది. వీరినే మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సేవ చేస్తే సరిపోతుంది. – నరేష్, స్వప్న, నవాబుపేట

ముగ్గురు పిల్లలుకావాలనుకుంటున్నాం..

ముగ్గురు పిల్లలుకావాలనుకుంటున్నాం..