వృద్ధిరేటు తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

వృద్ధిరేటు తగ్గుముఖం

Jul 11 2025 6:15 AM | Updated on Jul 11 2025 6:15 AM

వృద్ధ

వృద్ధిరేటు తగ్గుముఖం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఏటా జనాభా వృద్ధిరేటు గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గత దశాబ్దకాలంగా శిశుజననాలు తగ్గుతుండగా, వయో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. శిశువుల రేటు కన్నా వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతున్న కారణంగా భవిష్యత్‌లో ‘ఇతరులపై ఆధారపడే వారి నిష్పత్తి’ పెరుగుతోంది. యువ జనాభా తగ్గుముఖం పడుతుండటం, వృద్ధుల జనాభా ఎక్కువగా ఉండటం వల్ల యువతపైనే సామాజిక, ఆర్థిక బాధ్యతలు పెరుగుతున్నాయి. 1991 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, సామాజిక మార్పులు, ఉమ్మడి కు టుంబాలు విచ్ఛిన్నం కావడం, న్యూక్లియర్‌ కుటుంబాలకు ప్రాధాన్యం పెరగడం, ఎక్కువ మంది సంతానం ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయన్న కారణంతో జననాల వృద్ధిరేటు గణనీయంగా పడిపోతోంది. 1951 నుంచి 2011 వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన జనాభా లెక్కల ఆధారంగా జనాభా వృద్ధిరేటు, మారుతున్న ట్రెండ్స్‌ను బట్టి పరిస్థితి అర్థమవుతోంది.

సీ్త్ర, పురుష నిష్పత్తిలో పెరుగుతున్న అంతరం..

ఉమ్మడి జిల్లాలో మొత్తం జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉండాల్సిన సీ్త్రల నిష్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆడ పిల్లల జననాలపై వివక్ష, అబార్షన్లు తదితర కారణాలతో మొత్తం జనాభాలో సీ్త్రల నిష్పత్తి తగ్గుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో 7,45,101 మంది పురుషులకు 7,41,676 మంది మాత్రమే సీ్త్రలు ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 4,37,986 మంది పురుషులు ఉంటే 4,23,780 మంది సీ్త్రలు ఉన్నారు. గద్వాల జిల్లాలో 3,09,274 మంది పురుషులు ఉండగా, 3,00,716 మంది సీ్త్రలు, వనపర్తి జిల్లాలో 2,94,833 మంది పురుషులు ఉంటే 2,82,925 మంది సీ్త్రలు ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా..

ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే ఎక్కు వశాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 89.81 శాతం మంది గ్రామీణు లు కాగా, 10.19 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. గద్వాల జిల్లాలో 89.64 శాతం మంది గ్రా మీణ ప్రాంతాల్లో, 10.36 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 84.03 శాతం గ్రామాల్లో, 15.97 శాతం పట్టణాల్లో ఉంటున్నారు. మహబూబ్‌నగర్‌ (నారాయణపేటతో కలిపి) జిల్లాలో 79.27 శాతం గ్రామీణ జనాభా ఉండగా, 20.73 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు.

1991 నుంచి భారీగా తగ్గుదల

ఉమ్మడి జిల్లాలో 1951 నుంచి చేపట్టిన జనాభా లెక్కలను పరిశీలిస్తే ప్రతి దశాబ్దానికి కనీసం 9 శాతం నుంచి 26 శాతం వ రకు జనాభా వృద్ధిరేటులో పెరుగుదల కనిపించింది. అయితే 1991 నుంచి కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు, సామా జికంగా మార్పుల కారణంగా జనాభా వృద్ధి భారీగా తగ్గింది. 1951 నుంచి 1961 వర కు 9.92 శాతం వృద్ధి కనిపించగా, 1971 నాటికి ఏకంగా 21.46 శాతం జనాభా వృద్ధి నమోదైంది. 1981 నాటికి 26.53 శాతం, 1991లో 25.87 శాతం జనాభా వృద్ధి చెందింది. అయితే 1991 లో 25.87 శాతం నుంచి 2001 నాటికి జనాభా వృద్ధి 14.20 శాతానికి, అక్కడి నుంచి 2011 నాటికి 15.34 శాతానికే పరిమితమైంది.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటేటా తగ్గుతున్న జననాలు

పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య

1991 నుంచి జనాభా వృద్ధిరేటులో భారీగా తగ్గుదల

భవిష్యత్‌పై ఆందోళన, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంతానాన్ని తగ్గించుకుంటున్న వైనం

వృద్ధిరేటు తగ్గుముఖం1
1/1

వృద్ధిరేటు తగ్గుముఖం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement