
నిలబెట్టుకోవాలి
నాగర్‌కర్నూల్
వైద్యులు నమ్మకాన్ని
.. పట్టించుకోరు
జడ్చర్లలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.5.50 కోట్లతో ప్రతిపాదించారు.
శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025
వివరాలు 8లో u
మహిళల ఆర్థిక
సాధికారతే ముఖ్యం
రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళా సాధికారత దిశగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని జిల్లా ఇన్‌చార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో రూ.110 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ సీఎం, మంత్రుల సహకారంతో కల్వకుర్తి ప్రజల అవసరాల కోసం వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేశామని తెలిపారు. మున్సిపాలిటీలోని కొట్ర నుంచి పట్టణం వరకు 4.5 కి.మీల రోడ్డు వెడల్పు కోసం రూ.65 కోట్లు, పట్టణంలోని 99వ సర్వే నంబర్‌లో రూ.45 కోట్లతో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేపట్టారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రూ.7.13 కోట్ల రుణాల చెక్కులను మంత్రులు మహిళలకు అందజేశారు. డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్‌లోని పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
రెండు వరుసల బీటీ పనులకు..
వెల్దండ మండల కేంద్రం నుంచి చారకొండ మండలంలోని సిర్సనగండ్ల దేవస్థానం వరకు రూ.40 కోట్లతో మంజూరయిన రెండు వరుసల బీటీరోడ్డు నిర్మాణం కోసం వెల్దండలో మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు అంబేడ్కర్, ఇందిరాగాంధీ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొట్రగేట్ నుంచి తలకొండపల్లి వరకు రూ.65కోట్ల మంజూరు కావడంతో 22 కిలోమీటర్ల రెండు వరుసల బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ రూరల్/కల్వకుర్తి/ కల్వకుర్తిటౌన్/వెల్దండ: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించి వైద్యులు ప్రజలకు నమ్మకం కలిగించాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కష్ణారావు, దామోదర రాజనర్సింహ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో 26 ఎకరాల్లో రూ.180 కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాలను ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, వంశీకష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. దీంతో పాటు రూ.235 కోట్లతో 550 పడకల సామర్థ్యంతో అధునాతన వసతులతో నూతన ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రుల్లోఅధునాతన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేంద్రం, జిల్లాకు ఓ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మెడికల్ కళాశాలకు రూ.50 లక్షలతో ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు చేసి విద్యార్థుల రవాణా సదుపాయం కల్పిస్తామని మంత్రి జూపల్లి తెలిపారు.
రూ.140 కోట్లతో రోడ్ల అభివృద్ధి
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తి, జడ్చర్ల రోడ్డు, మహబూబ్‌నగర్–మన్ననూరు రోడ్డు విస్తరణకు రూ.140 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో పేదలకు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ మెడికల్ కళాశాల, ప్రజా ప్రభుత్వ వైద్యశాల జిల్లాకే మకుటంగా అభివర్ణించారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.
తూడికుర్తిలో పీహెచ్‌సీ..
మండలంలోని తూడుకుర్తిలో రూ.2 కోట్లతో మంజూరైన ప్రాథమిక అరోగ్య కేంద్రానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ భూమి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. 28 ఏళ్ల క్రితమే దామోదర్‌రెడ్డి తన తండ్రి రాంచంద్రారెడ్డి పేరు మీద 10 ఎకరాల స్థలంలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నెలకొల్పారని కొనియాడారు. నాగర్‌కర్నూల్ నుంచి జడ్చర్ల వరకు రూ.150 కోట్లతో 4లైన్ల రోడ్డు వేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్, డీసీహెచ్‌ఎస్ రామకృష్ణ, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, ఆర్డీఓ శ్రీను, మున్సిపల్ కమిషనర్ మహామూద్‌షేక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, గ్రంథాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, నాగర్‌కర్నూల్: ‘బీఆర్‌ఎస్ సోషల్ మీడియాను బాగా వాడుకుంటోంది. ప్రభుత్వంపై ప్రతీ విషయంలో పోస్టులతో అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అందుకు ధీటుగా కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేయడం లేదు. మనమూ అదేస్థాయిలో బీఆర్‌ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమవుతున్నాం.’ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వంద పడకల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియాకు ధీటుగా కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
న్యూస్‌రీల్
‘కాంగ్రెస్ సోషల్ మీడియా ఎక్కడుంది..’?
ఆస్పత్రికి వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన సేవలు అందించాలి
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కష్ణారావు,
దామోదర రాజనర్సింహ
జిల్లావ్యాప్తంగా పలు అభివృద్ధి
పనులకు భూమిపూజ

నిలబెట్టుకోవాలి

నిలబెట్టుకోవాలి

నిలబెట్టుకోవాలి