లో లెవల్‌.. హై రిస్క్‌! | - | Sakshi
Sakshi News home page

లో లెవల్‌.. హై రిస్క్‌!

Jul 12 2025 7:09 AM | Updated on Jul 12 2025 10:58 AM

లో లె

లో లెవల్‌.. హై రిస్క్‌!

వంతెనలు లేక

ప్రజలకు చింతలు

రఘుపతిపేట వద్ద పనులు

ప్రారంభించాం

తెలకపల్లి, కల్వకుర్తి ప్రధాన రహదారిలో రఘుపతిపేట వద్ద దుందుభీ వాగుపై వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఉప్పునుంతల, మొల్గర వాగుపై ఇప్పటికే సర్వే చేసి భూసార పరీక్షలు నిర్వహించాం. ఇందుకు అనుగుణంగా వంతెన డిజైన్‌ చేసి ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీకి పంపించాం. డిజైన అప్రూవల్‌ రాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.

– జలంధర్‌,

ఆర్‌అండ్‌బీ డీఈ, అచ్చంపేట

నిధులు మంజూరైనా

మొదలు కాని పనులు

హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణాలు

పూర్తయ్యేదెన్నడో?

అచ్చంపేట: ప్రజా సంబఽంధాలు, అభివృద్ధిలో రహదారులు పాత్ర కీలకం. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్మించిన అనేక రోడ్లు వర్షాల కారణంగా వచ్చిన వరదలకు ధ్వంసం కాగా.. దశాబ్దాల క్రితం పలుచోట్ల నిర్మించిన లో లెవల్‌ కాజ్‌వేలు, వంతెనలు శిథిలావస్థకు చేరాయి. జిల్లాలో దుందుభీ వాగు తిమ్మాజీపేట, తాడూరు, తెలకపల్లి, ఉప్పునుంతల, వంగూరు, అచ్చంపేట మండలాల్లో వివిధ గ్రామాల శివారు మీదుగా ఉన్న ప్రవహిస్తోంది.

పాలకుల నిర్లక్షమే..

గత ప్రభుత్వ హయాంలో కొత్త వంతెనలు, రహదారుల మరమ్మతులకు రూ.కోట్లు మంజూరు చేసినా.. నిర్మాణాలు నత్తనడకన సాగతున్నాయి. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించినా బిల్లులు రావడం లేదన్న సాకుతో నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నారు.

● నాగర్‌కర్నూల్‌–పాలెం రహదారిలో నల్లవాగుపై వంతెన పనులు దాదాపు పూర్తయి రెండేళ్లు అవుతుంది. వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌ పనులు పూర్తి వేయాల్సి ఉంది.

● తాడూరు మండలం సిర్సవాడ–మాధారం దుందుభీ వాగుపై 300 మీటర్ల వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న రూ.20.20కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులు మొదలు కాలేదు.

● ఉప్పునుంతల–మొల్గర మధ్య దుందుభీ వాగుపై ఉన్న కల్వర్టు తెగిపోయింది. హైలెవల్‌ వంతెన నిర్మాణానికి 2023 జులై 24న రూ.35కోట్ల నిధులు మంజూరయ్యాయి. 80 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తులో కొత్త వంతెన నిర్మించాల్సి ఉంది. టెండర్‌ ప్రక్రియ పూర్తయినా నిర్మాణ పనులు దక్కించుకున్న కంట్రాక్టర్‌ పనులు మొదలు పెట్టలేదు. రెండేళ్ల క్రితం ఈ వాగు పొర్లడంతో చేపల వేటకు వెళ్లిన బాలుడు నీటిలో కొట్టుకపోయి మృతి చెందాడు.

● తెలకపల్లి–రఘపతిపేట దుందుభీ వాగుపై వంతెన నిర్మాణ కోసం రూ.45కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇటీవల కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించారు. పిల్లర్ల దశలో పనులు ఉండటంతో ఈ వర్షాకాలంలో అవస్థలు తప్పవు. 2022 ఆగస్టు 30న రఘపతిపేట వద్ద దుందుభీ వాగు కాజ్‌వేపై బస్సు నీటిలో చిక్కుకుంది.

● కోడేరు–పెద్దకొత్తపల్లి ప్రధాన రహదారిలో బావాయిపల్లి డ్యామ్‌ నిర్మాణానికి మూడేళ్ల క్రితం రూ.96లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు.

● ఖానాపూర్‌–పసుపుల వాగుపై వంతెన నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ.4కోట్లు మంజూరైనా పనులు మొదలు కాలేదు. మూడేళ్ల క్రితం వాగు ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకపోయి మృతి చెందాడు.

● వెల్దండ మండలంలోని సిరసగండ్ల, చారకొండ వెళ్లే బైరాపూర్‌ వాగు ఉధృతికి 2022లో వంతెన కొట్టుకపోయింది. అప్పట్లో వంతెన నిర్మాణానికి రూ.3.50కోట్లు నిధులు మంజూరయినా.. పనులు ప్రారంభించలేదు. అలాగే చెర్కూర్‌, గాన్‌ గట్టుతండా మధ్య వాగుపై వంతెనకు రూ.4.15కోట్ల మంజూరైనా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

● బిజినేపల్లి–జడ్చర్ల ప్రధాన రహదారి గుమ్మకొండ సమీపంలో వట్టెం రిజర్వాయర్‌ నుంచి కర్వెన రిజర్వాయర్‌కు వెళ్లే కెనాల్‌పై బ్రిడ్జి పనులు ప్రారంభించినా పూర్తి కాలేదు.

● అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ ప్రధాన రహదారిలో బల్మూర్‌ మండలం గట్టుతుమ్మన్‌–తుమ్మన్‌పేట స్టేజీ, కనకాల మైసమ్మ–జిన్‌కుంట మధ్య బిజినేపల్లి మండలంలోని మహాదేవునిపేట వద్ద వంతెనలు శిథిలావస్థలో ఉన్నాయి.

● లింగాల–చెన్నంపల్లి మధ్య పెద్ద వాగు ప్రవాహంతో చెన్నంపల్లి, ఎర్రపెంట, పద్మనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి.

● బల్మూర్‌ మండలంలోని చిన్నపల్లె చెరువు అలుగు పారితే చెన్నారం, వీరంరాజుపల్లి, రామాజీపల్లి ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే కొండనాగుల, అచ్చంపేట మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది.

● గోకారం, తుర్కపల్లి మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరయ్యాయి.

– వంగూరు, జూపల్లి మధ్య వాగుపై వంతెన నిర్మించాల్సి ఉంది.

● అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి, చందంపేట రహదారిపై దుందుభీవాగు దాటేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఎక్కువగా ఈవంతెన దాటి దేవరకొండ, చందంపేటకు వెళ్తుంటారు. దుందుభీ పొర్లితే ఈప్రాంత వాసులు అచ్చంపేట మీదుగా 70కి.మీల దూరం అదనంగా తిరగాల్సి వస్తోంది.

● కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌, ముక్కిడిగుండం మధ్య పెద్దవాగుపై వంతెన పనులు పూర్తి కాగా.. అప్రోచ్‌ రోడ్డు పనులు చేయాల్సి ఉంది.

లో లెవల్‌.. హై రిస్క్‌! 1
1/1

లో లెవల్‌.. హై రిస్క్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement