
కాల్వల సామర్థ్యం సైతం అంతంతే..
కేఎల్‌ఐ మొదటి డిజైన్ ప్రకారం కాల్వలను వెడల్పు చేయకుండా కుదించారు. దీంతో పంపింగ్ చేసే నీటి సామర్థ్యాన్ని తట్టుకోలేక కాల్వల కట్టలు అక్కడక్కడ తెగిపోతున్నాయి. ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు పంపుహౌజ్‌లలో ఉన్న ఐదు మోటార్లు 4వేల క్యూసెక్కులకు పైగా నీటిని తోడిపోస్తాయి. ఈ నీరు వెళ్లాలంటే 9మీటర్ల వ్యాసం గల కాల్వలు ఉండాలి. ప్రస్తుతం 6, 7 మీటర్లతో ఏర్పాటు చేశారు. కాల్వల నిర్మాణం కూడా మొదట్లో 20.5 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని ప్రాథమికంగా అంచనా వేసి రూపొందించారు. దీన్ని 10 నుంచి 14 మీటర్ల వరకు డిజైన్ చేశారు. ఆ తర్వాత తగ్గించి తవ్విన కాల్వలో 3,200 క్యూసెక్కులు మాత్రమే పారుతోంది. దీంతో తరచుగా కాల్వలకు గండ్లు పడి పంట పొలాలు నీటమునుగుతున్నాయి.ఈ సమస్యను అధిగమించాలంటే కాల్వల ఎత్తు సైతం పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.