
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
అచ్చంపేట రూరల్: వానాకాలంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్ ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులకు సూచించారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో మర్చంట్ అసోసియేషన్ భవనంలో డివిజన్‌లోని ఫర్టిలైజర్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో డీఏఓ మాట్లాడారు. నిబంధనల మేరకు ఫర్టిలైజర్ దుకాణాలను నిర్వహించాలని అన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఉచితంగా పంపిణీచేసిన యంత్రాలతో ఎరువుల విక్రయ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఓలు కృష్ణయ్య, అనిల్‌కుమార్, నరేష్, మహేశ్ కుమార్, కోరమండల్ ఆగ్రో సమిస్ట్ శివయాదవ్ పాల్గొన్నారు.