
జలయజ్ఞం ప్రాజెక్ట్‌లపై నజర్
కోయిల్‌సాగర్:
చివరి దశలో పనులు
2006లో రూ.349 కోట్లు కేటాయించి.. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. పనులు పూర్తి కాకుండానే పదేళ్ల తర్వాత 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలు, లింక్ కెనాల్ కింద కొత్తగా పిల్ల కాల్వల పనులు చేపట్టడానికి రూ.50 కోట్లతో రీ టెండర్లు పిలిచారు. అలాగే నాగిరెడ్డిపల్లి ఫేస్1, తీలేర్ ఫేస్ 2 పంపుహౌస్‌లలో పెండింగ్‌లో ఉన్న పనులకు రూ.16.90 కోట్లతో రీ టెండర్లను పిలిచారు. ఎత్తిపోతల పథకం లక్ష్యం 50,250 ఎకరాలు కాగా.. వానాకాలం పంటల కింద 36 వేల ఎకరాలలకు, యాసంగిలో 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోయిల్‌సాగర్ బ్యాక్ వాటర్ నుంచి దేవరకద్ర గ్రావిటీ కెనాల్‌ను రూ.23 కోట్లతో చేపట్టగా పనులు చివరిదశలో ఉన్నాయి. అజిలాపూర్, చౌదర్పల్లి ఎత్తిపోతల పథకం, రాజోలి నుంచి పేరూర్ వరకు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టాల్సి ఉంది.
పెండింగ్ భూసేకరణపై సర్కారు ప్రత్యేక దృష్టి
● నెట్టెంపాడులో 610 ఎకరాలకు రూ.25 కోట్లు విడుదల
● ‘పాలమూరు’లో 15 వేల ఎకరాలకు రూ.300 కోట్లు..
● భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల
పనులపైనా కసరత్తు
● పనుల పురోగతిపై ప్రత్యేక అధికారి రవినాయక్ ఆరా
● ఇటీవల ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు,ఇరిగేషన్ అధికారులతో సమీక్ష
ప్రాజెక్ట్

జలయజ్ఞం ప్రాజెక్ట్‌లపై నజర్

జలయజ్ఞం ప్రాజెక్ట్‌లపై నజర్