
ఎదురుచూపులు
‘రైతు భరోసా’కు
●
పెట్టుబడి సాయం
అందించాలి..
వానాకాలం సమీపిస్తోంది. ఈ పాటికే పత్తి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకొని ఉంచుకోవాలి. చేతిలో డబ్బులు లేకపోవడంతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సాయం అందిస్తే రైతు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ఉంటారు. – ఆదికొండ
కరీం, రైతు, గట్టురాయిపాకుల (తెలకపల్లి)
ఎలాంటి ఆదేశాలు రాలేదు..
రైతుభరోసా నిధులకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. రైతులు, వారి ఖాతా వివరాల సమాచా రం ప్రభుత్వం వద్దే ఉంటుంది. దాని ఆధారంగానే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది.
– చంద్రశేఖర్, డీఏఓ, నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్: రైతులు పంటల సాగుకు అప్పులు చేయకుండా పెట్టుబడి సాయం అందించి ఆదుకునేందుకు 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. రైతులు పంటలు సాగు చేసేముందు నిధులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తే సాగుకు వినియోగించుకునేవారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు ఇస్తుండగా.. ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీనిచ్చింది. గత సీజన్‌లో రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయగా ఈ వానాకాలం సీజన్‌లో మాత్రం ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వం రైతుభరోసా పేరుతో హామీనిచ్చింది. కానీ నేటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను అశ్రయించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వానాకాలం పంటల సాగుకుగాను రైతులు పొలాలు దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. వర్షాలు ప్రారంభమైతే పనులు ఊపందుకోనుండగా.. రైతుభరోసాపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిధుల జమపై అనిశ్చితి నెలకొంది. గత ప్రభుత్వం పంటల సాగుకు ముందే రైతుబంధు నిధులు ఎప్పుడు జమచేసేదో ప్రకటన చేసేది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
గతేడాది రూ.247.39 కోట్లు జమ..
2024 యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 2.47 లక్షల మంది రైతులకు సుమారు రూ.247.39 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. కాగా అందరు రైతులకు ఒకేసారి జమ చేయకుండా ఎకరాల వారీగా ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఒక ఎకరం మొదలుకొని విడతల వారీగా ఎక్కువ పొలం ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమయ్యాయి.
● జిల్లాలో వానాకాలం పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలో గతేడాది వానాకాలంలో 4,35,692 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా.. ఈ ఏడాది 5,38,462 ఎకరాల పంటలు సాగవుతాయని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో వరి 1,60,021 ఎకరాలు, పత్తి 2,86,471, జొన్న 7,822, మొక్కజొన్న 72,929, కంది 8,909, మినుములు 368, వేరుశనగ 895, ఆముదం 239, ఇతర పంటలు 808 ఎకరాలుగా రూపొందించారు. ఇక పండ్లు, ఇతర పంటలు మరో 52,603 ఎకరాలుగా నిర్ధారించారు. ప్రతి ఏటా పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండటంతో రైతుభరోసా జమ చేస్తే రైతులకు కొంత ఊరట కలగనుంది.
వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు
నేటికీ ప్రకటించని రాష్ట్ర ప్రభుత్వం
మళ్లీ వడ్డీ వ్యాపారులను
ఆశ్రయిస్తున్న రైతులు

ఎదురుచూపులు

ఎదురుచూపులు