
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
బిజినేపల్లి: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామని సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్ నర్సింహ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం మండలంలోని వెల్గొండలో సీపీఐ నాయకుడు ఈర్ల గంగాధర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏడు రాష్ట్రాల్లో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపేందుకు యత్నిస్తోందని ఇది సరికాదని వెంటనే శాంతి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పాకిస్తాన్, భారత్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకోవడం అప్రజాస్వామ్యమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణాజీ, ఈర్ల భూపేష్‌బాబు, ఈర్ల చంద్రమోళి, కృష్ణారెడ్డి, భూపేష్‌బాబు, పురుషోత్తం, ఈర్ల గంగాధర్, కంతం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.