
నీటి వృథాకు అడ్డుకట్ట
పూర్తయిన జూరాల ఎడమ కాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతు
సుమారు 30 ఏళ్ల కిందట..
జూరాల ఎడమ కాల్వ కింద జిల్లాలో సుమారు 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏడాదికి రెండుసార్లు పంటలకు సాగునీరు అందిస్తారు. సుమారు 30 ఏళ్ల కిందట బిగించిన షట్టర్లు వంగిపోయి దెబ్బతినడంతో మూసినా నీరు వృథాగా పారుతోంది. వారబందీ సమయంలో లీకేజీల కారణంగా నిత్యం 150 క్యూసెక్కులకు పైగా నీరు వృథా అవుతుండటంతో మరమ్మతులు చేపట్టారు. యాసంగిలో వారబందీ విధానంలో రామన్‌పాడు రిజర్వాయర్ వరకు సాగునీటిని వదిలారు.
సమాంతర కాల్వకు మోక్షమెన్నడో?
భీమా ఫేజ్–2 ఎత్తిపోతల కోసం సమాంతర కాల్వను ఏర్పాటు చేశారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుకు వస్తున్న నీటిని కాల్వ ద్వారా పంపింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. కాని భీమా అధికారులు కాల్వ ప్రధాన షట్టర్లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యం 150 క్యూసెక్కుల నీరు కాల్వలో వృథాగా పారుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన ఎడమకాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆయకట్టుకు సాగునీటి సరఫరా నిలిపివేసినా షట్టర్ల లీకేజీలతో రోజు కాల్వలో వృథాగా పారి జలాశయంలో నిల్వ నీటిమట్టం తగ్గుముఖం పట్టేది. నిత్యం 150 నుంచి 200 క్యూసెక్కుల నీరు వృథా అవుతుండటంతో అధికారులు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఎడమ కాల్వకు 4 సాధారణ, 4 ఎమరెన్సీ షటర్లు ఉండగా.. 4 సాధారణ షట్టర్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతుంది. దీంతో వీటి మరమ్మతుకు రూ.7.50 లక్షలతో టెండర్లు ఆహ్వానించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వేగంగా మరమ్మతులు పూర్తిచేశారు. ఇకనుంచి యాసంగి సీజన్‌లో ఆయకట్టుకు వారబందీ సమయంలో సాగునీరు నిలిపివేసే సమయంలో చుక్కనీరు ముందుకు పారకుండా షట్టర్లను పక్కాగా బిగించనున్నారు.
నాలుగు షట్టర్లకు రూ.7.50 లక్షల వ్యయం
వారబందీ సమయంలో నీరు వృథా కాకుండా చర్యలు
ఎట్టకేలకు మోక్షం

నీటి వృథాకు అడ్డుకట్ట