ములుగు రూరల్: మేడారం మహాజాతరలో నాయీబ్రాహ్మణ వృత్తిదారులకు గుర్తింపు కార్డులు అందించాలని నాయీబ్రాహ్మణ జనశక్తి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పుగొండ సతీష్ అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్కకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో నాయీబ్రాహ్మనులకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గతంలో సంఘానికి కేటాయించిన భూమిని సర్వే నిర్వహించి తిరిగి అప్పగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నం మోహన్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి తంగేళ్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మురహరి శ్రీకాంత్, రవీందర్, సతీష్, వేణు, రఘువీర్, కృష్ణ, గౌతమ్, రాకేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


