స్వచ్ఛమైన తాగునీటితోనే ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన తాగునీటితోనే ఆరోగ్యం

Sep 18 2026 1:51 AM | Updated on Sep 18 2026 1:51 AM

బాలవికాస ప్రోగ్రాం మేనేజర్‌

మంజులారెడ్డి

గోవిందరావుపేట: స్వచ్ఛమైన తాగునీటితోనే ఆరోగ్యంగా ఉంటారని బాలవికాస ఆదర్శ ప్రోగ్రాం మేనేజర్‌ మంజులారెడ్డి అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీపురంలో మంచినీటి శుద్ధీకరణ ప్లాంట్‌ ఏర్పాటుపై గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంజులారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేయనున్న నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ ద్వారా ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్లాస్టిక్‌ వినియోగంతో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను వివరించారు. అనంతరం బాలవికాస వాటర్‌ ప్లాంట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అధిక ప్లోరైడ్‌, ఇతర హానికర ఖనిజాలతో కూడిన నీటిని తాగడం వల్ల ఫ్లోరోసిస్‌, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ప్లాంట్‌ను సద్వినియోగం చేసుకోవడంతో పాటు దాని నిర్వహణ, సంరక్షణలో భాగస్వాములు అవుతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్‌ బాలమోహన్‌రెడ్డి, ఫీల్డ్‌ కోఆర్డినేటర్లు విమల్‌, రాజుకుమార్‌, వినయ్‌, శంకర్‌, వార్డుస భ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement