● సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి
ములుగు రూరల్: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో భూ పోరాటాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను రత్నం రాజేందర్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ పోరాటంలో ఎంతోమంది కమ్యూనిస్టులు చేసిన పోరాటాల ఫలితంగానే నిజాం రాచరిక ప్రభుత్వం రద్దు అయ్యిందని తెలిపారు. దున్నేవాడికే భూమి, వెట్టి చాకిరి రద్దు కావాలని ఆంధ్ర మహాసభ ప్రధాన డిమాండ్లతో పారాటం సాగిందని వెల్లడించారు. ఈ మహత్తర పోరాటాన్ని వక్రీకరించడానికి బీజేపీ ప్రయత్ని స్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మ వెంకటరెడ్డి, రత్నం ప్రవీన్, ఐలయ్య, రవి, రాజు, కోటయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


