ప్రజాపాలన వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలన వేడుకలు

Sep 18 2026 1:51 AM | Updated on Sep 18 2026 1:51 AM

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ప్రజాపాలన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఐటీడీఏ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో ఎగురవేశారు. అనంతరం జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ దామోదరస్వామి, డీడీ జనార్దన్‌, డీటీ అనిల్‌, జేడీఎం కొండల్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌, తిరుపతి, స్రవంతి, హేమంత్‌, వెంకట్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విశ్వకర్మ జయంతి

వేడుకలు

ములుగు: జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ భవనంలో భగవాన్‌ మద్విరాజ్‌ విరాట్‌ విశ్వకర్మ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రామ్మోహన్‌ అతిథిగా హాజరై తెలిపారు. తొలుత భగవాన్‌ మద్విరాజ్‌ విరాట్‌ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భగవాన్‌ విశ్వకర్మను సృష్టికర్తగా, నిర్మాణకళకు అద్యుడిగా భావిస్తారని రామ్మోహన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎల్కతుర్తి రాజన్న, నరసింహచారి, రేసోజు పద్మ, పానుగంటి రాజయ్య, కాగితపు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్పీడీసీఎల్‌ ఏఏఓగా మంజినాయక్‌

ములుగు: ములుగు ఎన్పీడీసీఎల్‌ ఏఏఓగా మదనపల్లి గ్రామానికి చెందిన పోరిక మంజినాయక్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వర్ధన్నపేట జేఏఓగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై ములుగు ఏఏఓగా బదిలీపై వచ్చార. ఈ మేరకు గురువారం ఎస్‌ఈ భిక్షపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సహచార ఉద్యోగులు, సిబ్బంది మంజినాయక్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

భూములు కబ్జా

చేసేందుకే 22ఏ

భూపాలపల్లి: భూములు కబ్జాచేసేందుకే అధికార కాంగ్రెస్‌ పార్టీ 22ఏను తీసుకువచ్చిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లిలోని 106 ఎకరాల అటవీ భూములపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించగా, అటవీశాఖ అధికారులతో మాట్లాడి సుప్రీంకోర్టులో కేసు వేయించి అటవీశాఖకే భూమి చెందేలా చూశానన్నారు. తాను 2023లో 1,400 ఎకరాలు, తాజాగా 106 ఎకరాలు కబ్జా చేశానని సీఎం నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తారా అని ప్రశ్నించారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో రాష్ట్రంలోని భూముల వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపించాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement