వాజేడు: గోదావరి వరదలతో ముంపునకు గురయ్యే పల్లపు ప్రాంతాలను ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌బట్ పరిశీలించారు. సోమవారం వాజేడు మండలపరిధిలోని టేకులగూడెం సమీపంలో ఉన్న రేగుమాకు ఒర్రె , పేరూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరిహద్దు ప్రాంతాల్లోని ముంపు ప్రాంతాలను వెంకటాపురం(కె) సీఐ ముత్యం రమేశ్‌తో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలు కురిసి గోదావరి వరదలు వస్తే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలుపై చర్చించారు. ఆయన వెంట వెంకటాపురం(కె) సీఐ ముత్యం రమేష్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ ఉన్నారు.


