పెట్టుబడి సాయమెంత? | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి సాయమెంత?

Jun 30 2026 1:12 AM | Updated on Jun 30 2026 1:12 AM

ములుగు: వానాకాలం పెట్టుబడి సాయం అందించేందుకు రంగం సిద్ధమైంది. నేడు (మంగళవారం) రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే పెట్టుబడి సాయం ఎన్ని ఎకరాలకు అందుతుందో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. మొదట్లో రెండు విడతల్లో కలిపి ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయాన్ని అందించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి రూ.12వేల చొప్పున రెండు విడుతల్లో అందిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదు. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తుందో స్పష్టత లేకపోవడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.

జిల్లాలో 86,736 మంది రైతులు

జిల్లాలో మొత్తం 86,736 మంది రైతులున్నారు. పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకం అమలు చేయడానికి రూ.104.38 కోట్ల నిధులు అవసరం ఉంది. గత వానాకాలం సీజన్‌లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించిన సర్కారు.. యాసంగికి వచ్చేసరికి రెండెకరాలకే పరిమితం చేసింది. యాసంగి సీజన్‌ ముగుస్తున్న సమయంలో పెట్టుబడి సాయాన్ని అందించడం గమనార్హం. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించిన నిధులను జూన్‌ 30న విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్ని విడతలు, ఎన్ని ఎకరాలకు ఇస్తారో చెప్పలేదు. మళ్లీ ఒకటి, రెండు ఎకరాలకు వేసి చేతులెత్తేస్తారా, పూర్తి స్థాయిలో అమలు చేస్తారా? అనే సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి.

పెట్టుబడులకు ఊరట

ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తే రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడులకు గాను కొంత ఊరట లభించనుంది. ఇప్పటికే ఎకరానికి సుమారు రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టారు. దుక్కులు దున్నడం, విత్తనాలు నాటడంతో పాటు ఎరువులు తీసుకొని నిల్వ చేసుకుంటున్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించనుండడంతో పంటల పెట్టుబడికి కొంత ఉపశమనం కలుగుతుందని రైతులు భావిస్తున్నారు.

స్పష్టత రావాల్సి ఉంది

రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్ని ఎకరాలకు ఎన్ని విడతల్లో పెట్టుబడి సాయాన్ని అందిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెట్టుబడి సాయం అందుతుంది. రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలోని 86,736 మంది రైతులకు రూ.104.38 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించాం.

– సురేష్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

మండలాల వారీగా రైతులు,

అవసరమైన నిధులు (రూ.కోట్లలో)

మండలం రైతులు పెట్టుబడి సాయం

నేడు ‘రైతు భరోసా’ నిధుల విడుదల

ఎన్ని ఎకరాలకు అందుతుందో స్పష్టత కరువు

యాసంగిలో రెండెకరాలకే అందిన సాయం

జిల్లాలో 86,736 మంది రైతులకు రూ.104.38 కోట్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement