ఏటూరునాగారం: మహబూబాబాద్ కొత్తగూడ మండలం బత్తుపల్లికి చెందిన నిరుద్యోగురాలు ఏఎన్‌ఎం, స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నారు. వాజేడు మండలం ఐటీఐ కార్యాలయంలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో గిరి వికాసం పథకం కింద వేసిన 26 బోర్లకు మోటార్లను ఇప్పించాలని కోరారు. ఖానాపురం మండలం భద్రుతండాలో కల్వర్టు మంజూరు చేయాలని కోరారు. వెంకటాపురం(ఎం) మండలం అందుగల మీది గ్రామంలో రేషన్‌షాపు నూతనంగా ఇప్పించాలని వేడుకున్నారు. భూపాలపల్లి మహాముత్తారం పీఎంఆర్‌సీలో కంప్యూటర్ ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో ఈఈ వీరభద్రం, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్‌రావు, జియాలజిస్ట్ కిషోర్, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, ఐటీడీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వినతులు స్వీకరిస్తున్న ఎస్‌డీసీ ప్రతాప్


