ఏజెన్సీలో భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో భారీ వర్షం

Jun 29 2026 1:17 AM | Updated on Jun 29 2026 1:17 AM

ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ మేరకు ఏటూరునాగారం మండలంలో 9 మిల్టీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అలాగే వాజేడు మండల పరిధిలోని అత్యధికంగా 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగును ప్రజలు బోటులో దాటారు. ఇటీవల వర్షాలకు కొండాయి– దొడ్ల మధ్యలో ఉన్న జంపన్నవాగు ఉధృతికి తాత్కాలిక రోడ్డు తెగిపోగా ప్రజల అవసరాల నిమిత్తం మళ్లీ తాత్కాలికంగా రోడ్డు వేశారు. దీంతో కొండాయి, మల్యాల, కొత్తూరు, గోవిందరాజుల కాలనీ ప్రజలకు రాకపోకలను మొదలయ్యాయి.

ఇళ్లలోకి వరదనీరు

అలాగే జీసీసీ వెనుకాల ఉన్న కొత్తగుడిసెల్లోని ఇళ్లకు నీరు వచ్చి చేరింది. ఆదివారం భారీ వర్షం కురవడంతో లోతట్టులో ఉన్న ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో నివాసం ఉంటున్న ప్రజలు నీటిని బయటకు పారబోస్తున్నారు. ఎత్తిపారబోసుకున్నారు. వర్షాలు ఎక్కువైతే గోడలు కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement