చినుకు రాలలేదు.. | - | Sakshi
Sakshi News home page

చినుకు రాలలేదు..

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

దుక్కులు సిద్ధం చేసుకుని ఉన్నాం..

జూన్‌లో వర్షపాతం వివరాలు (మి.మీ)

వర్షాభావంతో ఆందోళనలో అన్నదాతలు

మూడెకరాలు పొలం చేస్తా..

లక్షా 63వేల 229 ఎకరాల్లో పంటలు సాగు

ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలోని రైతులు లక్షా 63వేల 229 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కానీ సాగు పనులు మాత్రం ఇప్పటి వరకు మొదలుకాలేదు. జిల్లాలోని పది మండలాల్లో ఉన్న రైతులు 8 శాతం మాత్రమే నారు మడులను ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడు సన్న రకాలను మాత్రమే సాగు చేసుకోవాలని.. వాటిని సాగు చేస్తేనే బోనస్‌ వస్తుందని షరతు విధించడంతో రైతులు ఆ దిశగా ఆలోచనలో పడ్డారు. ఆ రకాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులు ఏడు రకాల విత్తనాల పేర్లను ప్రకటించారు. కొన్ని రకాలను రైతులకు కూడా అందజేశారు. ప్రభుత్వం ఏడు రకాలను అందుబాటులోకి తెచ్చింది. బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, కేఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 7715, డబ్ల్యూజీఎల్‌44, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్‌ వంటి రకాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. మిగతా రకాలు కూడా వేసుకోవచ్చు కానీ వాటికి ప్రభుత్వం బోనస్‌ వచ్చే అవకాశం లేదని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువగా కేఎన్‌ఎం 7715కు డిమాండ్‌ ఉన్నట్లు అధికారులు, డీలర్లు చెబుతున్నారు.

వర్షాలు పడితే నారుమడులు పోస్తాం. దుక్కులు సిద్ధం చేసుకుని ఉన్నాం. వర్షాలు ఎప్పుడు పడుతాయా అని ఎదురుచూస్తున్నాం. వర్షాలు లేకుంటే రైతులతో పాటు కూలీలు, వ్యాపారులకు నష్టం జరుగుతుంది.

– గోగు విజయబాబు, రైతు, ఏటూరునాగారం

మండలం ప్రస్తుతం గతేడాది

వెంకటాపురం(ఎం) 5.0 16.5

ములుగు 0.0 15.5

గోవిందరావుపేట 0.0 14.0

తాడ్వాయి 0.0 10.3

ఏటూరునాగారం 0.0 3.8

కన్నాయిగూడెం 1.4 2.0

వాజేడు 13.2 2.0

వెంకటాపురం(కె) 0.0 8.0

మంగపేట 0.0 5.3

మల్లంపల్లి 1.0 11.0

ఆరు మండలాల్లో

సున్నా వర్షపాతం నమోదు

కాలం గడుస్తున్నా సాగు పనులు

మొదలు పెట్టలేని పరిస్థితి

నేను మూడెకరాలు వరి పంట సాగుచేస్తా. గతేడాది ఈ పాటికి ఎప్పుడో వరినారు పోసినం. ఈ సారి వర్షాలు లేవని ఇంకా నారు పోయలేదు. వర్షాలు లేకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదు. పంట నెలరోజులు వెనుకకు పోయినట్లే.

– కొండాయి సమ్మయ్య,

ఏటూరునాగారం, రైతు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement